వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామానికి చెందిన పోటు రవి అనే యువకుడికి వరంగల్ చెందిన రాధికతో గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం వీరి కుటుంబం సాఫీగానే సాగింది పండంటి పాప కూడా జన్మించింది. గత కొన్ని రోజుల నుండి అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్ణయించారు. ఆ పంచాయతీలో ఇద్దరు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని పెద్ద మనుషులు తెలిపారు. అయినా రాధికను అత్తింటి వారు దూరం పెడుతుండటంతో శుక్రవారం నుండి అత్తగారి ఇంటి ముందు యువతి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు మీడియాకు తెలిపింది.