కాగజ్నగర్ మండలం అందవెల్లి బట్టుపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో బురదమయంగా మారి ప్రయాణికులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చొరవతో బుధవారం ఉదయం మరమ్మతులు ప్రారంభించారు. బట్టుపల్లి గ్రామ ప్రజలు విద్యార్థులు ధర్నా రాస్తారోకోలు నిర్వహించగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే జెసిబి యంత్రాలు, ట్రాక్టర్లతో మొరం పోసి మరమ్మతు పనులను ప్రారంభించారు.