ఇందిరా పార్క్ వద్ద కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న ధర్నాకు బీజేపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, శనివారం రామచంద్రపురంలోని స్వగృహంలో పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్సీ అంజి రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నిర్ణయాల కారణంగా వారు నష్టపోతున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ అక్రమ అరెస్ట్‌లను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.