రక్తదానంపై అపోహలు విడనాడి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య జి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.. శుక్రవారం ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మహారాణిపేట శాఖ నిర్వాహకురాలు శివలీల అక్కయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో ముందుగా ఆచార్య నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.విద్యార్థులు,యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసేవారు ఎంతో మందికి స్ఫూర్తి దాతలుగా నిలుస్తారన్నారు.