సైబర్ లా పై అవగాహన కలిగి ఉండాలి న్యాయవాదులు సైబర్ లా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఏపీ హైకోర్టు ఫార్మర్ జడ్జి జస్టిస్ డాక్టర్ వి.రాధాకృష్ణ కృపాసాగర్ తెలిపారు. శనివారం మదనపల్లె బార్ అసోసియేషన్ కార్యాలయంలో సైబర్ లా పై జరిగిన అవగాహన సదస్సుకు జస్టిస్ డాక్టర్ వి.రాధాకృష్ణ కృపాసాగర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. న్యాయవాదులు జడ్జికి సన్మానం నిర్వహించారు. అనంతరం జస్టిస్ మాట్లాడుతూ.. న్యాయమూర్తులు, సైబర్ లా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.