సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై. దోసి రెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈరోజు వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలనుంచి 192 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు.