న్యూగుంటూరు రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు 5 కోట్లతో చేపట్టనున్నట్లు గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం మాట్లాడారు. డొంకరోడ్డు మూడొంతెనల మార్గంలో వర్షం నీరు నిల్వకుండా ఉండాలంటే ఆక్రమించిన మరో 90 గృహాలను తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. రైల్వే, హౌసింగ్, రహదారి విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.