నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ప్రస్తుతం కురిసిన వర్షాలకు రోడ్లు గుంతల మయంగా మారాయని, గ్రామంలో సగానికి పైగా వీధిలైట్లు వేలగడంలేదని గ్రామం అందా కారం లో ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం అన్నారు. గురువారం 11 గంటల సమయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి చాణక్య రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.