సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో శుక్రవారం ఐదున్నర గంటల సమయంలో మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న పలువురు రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి మండల కేంద్రంలో పరిటాల రవీంద్ర 67వ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందజేస్తున్నామని అదే విధంగా శనివారం పరిటాల రవీంద్ర 67 జయంతిలోనూ టిడిపి నేతలు అభిమానులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.