నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన ద్వారా మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు.