ఆదిలాబాద్లో ఒకరోజు ముందే వినాయక పండగ సందడి మొదలైంది. మంగళవారం వినాయక విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు. లంబోదరుడిని పూజించేందుకు ప్రజలు ఉదయం నుంచి విగ్రహాలను తీసుకెళ్లారు. పట్టణంలోని పలు గణేశ్ మండపాల నిర్వాహకులు వినాయక ఆగమనం పేరుతో ఉత్సవాలను ఘనంగా జరిపారు.