అల్లూరి జిల్లా పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ సప్పి పుట్టు గ్రామానికి చెందిన కొర్ర కామేశ్వరరావు, పాంగి రాజారావు అనే గిరిజనులపై పోలీసులు అకారణంగా దాడి చేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పెదబయలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెచ్చంగి కొండయ్య ఇచ్చిన వివరాలు ప్రకారం సప్పిపుట్టు గ్రామానికి చెందిన ఇద్దరు జోలాపూట్ రిజర్వాయర్ చూసి తిరిగి వస్తున్న క్రమంలో దారి మధ్యలో వారిని పెదబయలు పోలీసులు ఆపి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఫోన్ లు లాక్కుని దాడికి దిగారని ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని మీడియాకు వెల్లడించారు.