సంగారెడ్డి జిల్లా తోగర్ పల్లి ప్రాథమిక,ఉన్నత పాఠశాలలో మెగా వనమహోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని అన్నారు. విద్యార్థులు నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. క్రీడల్లో విద్యార్థులు రాణించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.