వరంగల్ జిల్లా ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు బాలాజీ నగర్ లో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో దాడులు నిర్వహించారు. అందులో భాగంగా అద్దె ఇంట్లో ఇద్దరినీ అక్రమ రవాణా బాధితుల పేదరికంని ఆసరాగా చేసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను మరియు ఒక కస్టమర్ ని అరెస్ట్ చేసినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో భాగంగా ఇద్దరినీ రక్షించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో 9900 నగదు మూడు మొబైల్ ఫోన్లు 20 కాండమ్స్ ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.