చంద్రబాబుతోనే రాష్ట్రానికి గుర్తింపు: తిక్కారెడ్డి..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలిసారి బాధ్యతలు స్వీకరించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మిగనూరులో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని, దేశ చరిత్రలో ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు.