గాంధారి మండలంలోని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. గాంధారి మండలకేంద్రంలో ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో 42 సీసీ కెమరాలు ఏర్పాటు చేయించారు. మంగళవారం ఎస్పీ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సై ఆంజనేయులు , హెడ్ కానిస్టేబుల్ రవి, సంజయ్‌ని అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణతోపాటు నేరస్తులను త్వరగా గుర్తించవచ్చన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, వర్తక సంఘ సభ్యులను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పాల్గొన్నారు.