రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద నాటు సారా అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న ఆమనగల్ అబ్కారి శాఖ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రమావత్ సోనా, ఇస్లావత్ దూళి అనే ఇద్దరు మహిళలను నాటసారు అమ్ముతుండగా పోలీసు అధికారులు పట్టుకున్నారు. మొత్తం 13 లీటర్ల సారా, వాహనాలను సీజ్ చేసి మూడు కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అబ్కారి శాఖ అధికారులు వెల్లడించారు.