చంద్రశేఖరపురంలో కేజీబీవీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. కేజీబీవీ పాఠశాలల్లో బాలికలు పదవ తరగతితోనే విద్యను ఆపివేయకుండా, ఇంటర్ వరకు విద్యను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేజీబీవీ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేస్తుందన్నారు.