కూటమి ప్రభుత్వం హయాంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అదేవిధంగా సాంకేతి పరిజ్ఞానం ఉపయోగించడంలో గాని ప్రజలకు అందించడంలో కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రగామగా నిలిచారని విశాఖపట్నం ఎమ్మెల్యే గణబాబు అన్నారు మంగళవారం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా డిజిటలైజేషన్ లో కానీ విద్యా ఉద్యోగ పరిజ్ఞానం అందించడంలో గాని చంద్రబాబు అగ్రగామిగా ఉన్నారన్నారు