నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలంలోని ఊట్కూరు నుండి బండమీదిగూడెం వెళ్లే రోడ్డును సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాన రహదారి సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి ఊట్కూరు నుండి బండమీదిగూడెం వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.