యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండల పరిధిలోని దూది వెంకటాపురం గ్రామంలో విషాదం నెలకొంది. బుధవారం మధ్యాహ్నం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొడిసెల శ్రీరాములు గౌడ్ బుధవారం ఉదయం రోజువారి గీత వృత్తిలో భాగంగా తాడి చెట్టు ఎక్కి మేర చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు మోకుజారి తాటి చెట్టు పైనుండి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీరాములు గౌడ్ మృతికి యాదాద్రి భువనగిరి జిల్లా గీత కార్మిక సంఘం, రాజపేట మండల కమిటీ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.