తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు.తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్‌లో ₹33.13 కోట్లతో నిర్మించిన 2 మిలియన్ లీటర్ల ELSR, 4 మిలియన్ లీటర్ల GLSR రిజర్వాయర్లు, పంపు హౌస్, పైపులైన్ వ్యవస్థను ఎమ్మెల్యే ప్రారంభించారు. మొత్తం 5 రిజర్వాయర్లు నిర్మించి, కొత్త కాలనీల్లో పైపులైన్లు వేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్నారు.