లక్ష్మీదేవిపల్లి మండలం, బంగారు చెలక పరిధిలోని మాలగూడెంకి చెందిన కోడిరెక్కల సుధీర్ శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ ముగ్గురు వ్యక్తులు తన చావుకు కారణం అంటూ మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభించింది. తనకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ ప్రచారం చేశారని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు లేఖలో వెల్లడించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణ రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.