అర్హులైన వారికి ఇందిర మైండ్ లో కేటాయించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో, వరంగల్ ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై పాలకుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ వెల్టూరు నగేష్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుపేదల పార్టీ అని చెప్పుకుంటున్నారు కానీ, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మఇండ్లు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు, స్థానిక ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను పరిష్కరించి, అసలైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయించాలని, దీనిపై కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని డిమాండ్ చేశారు.