Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో రూ. 30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న డీఆర్ కాలువ పనులు రాజకీయ పంతాలకు వేదికగా మారిందా..? ఈ కాలువ పనులు జరిగితే రైతులకు మేలు జరుగుతుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పట్టుబట్టి పనులు చేయిస్తున్నారు. మరోపక్క సాక్షాత్తు డీఆర్ కాలువ నీటి సంఘం అధ్యక్షుడు మాలేపాటి సుధాకర్ నాయుడు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు దొంగ తూములు అంటే సైఫూన్ కడితేనే భవిష్యత్తుల్లో ఇబ్బందులు ఉండవని, జరుగుతున్న పనులపట్ల శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అభ్యంతరం చెబుతున్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు నోరు మెదపడంలేదు. అక్కడ