ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో కనీసం 70 శాతం వచ్చే విధంగా టీచర్లు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్స్, వెల్ఫేర్ కళాశాలలు, కేజీబివి లకు సంబంధించిన ప్రిన్సిపాల్స్ తో ఇంటర్మీడియట్ మొదటి, రెండు సంవత్సరాల అకాడమిక్ సంబంధించి సమావేశం నిర్వహించారు.