జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,గొర్రె గుండం గ్రామంలో ఆదివారం 9:40 PM కి 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది,జగిత్యాల కు చెందిన రమేష్ తన ద్విచక్ర వాహనంపై గొర్రె గుండం గ్రామం వెళ్లి తిరిగి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో, కోరుట్ల కు చెందిన నరసింహ చారి తన ద్విచక్ర వాహనంపై గొర్రె గుండం వెళుతున్న క్రమంలో 2 ద్విచక్ర వాహనాలు గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి, దీంతో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా నరసింహ చారి పరిస్థితి విషమంగా మారింది,స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఇద్దరి జగిత్యాలకు తరలించారు,నరసింహ చారికి మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ తరలించారు,