గురువారం ఉదయం 11 గంటలకు ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ వై వి రమణ ఆధ్వర్యంలో సుబ్బమ్మ దేవి హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు అభయ మహిళ భద్రత అనే అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహనను కల్పించినారు.ఈ కార్యక్రమంలో మహిళా ఎస్సై నాగ కళ్యాణి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ నేటి సమాజంలో నేర ప్రవృత్తి పెరిగి విచక్షణ లేకుండా నేరాలు చేస్తున్నటువంటి నేరగాళ్లను అదుపులోనికి తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో ఈ అభయ మహిళా భద్రత యాప్ ను ప్రవేశపెట్టినట్లు, తెలిపారు.