యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం మఠంపల్లిలోని మన గ్రోమోర్ వద్ద యూరియా పంపిణీ చేస్తుండగా, అరకొరగా వస్తున్న సరకు కోసం రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లాఠీ దెబ్బలు తిన్నా తమకు యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యూరియా కొరతను తీర్చాలని వారు డిమాండ్ చేశారు.