అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో ఆకాశంలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయి. సోమవారం సాయంత్రం ఆకాశం ఎరుపు రంగులో మారి దర్శనమిచ్చింది. ఆకాశం ఎరుపు రంగులో మేఘావృతమై చూపరులను కట్టి పడేసింది. ఆకాశం అగ్ని గుండంలా మారి సూర్యుడు ఎర్రటి తివాచీ పరిచినట్టు ఉన్న దృశ్యాలు చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఇది చూసిన యాడికి ప్రజలు, కొందరు ప్రకృతి ప్రేమికులు తమ స్మార్ట్ ఫోన్లకు పని చెప్పి ఫోటోలు తీశారు. అంతేకాకుండా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం యాడికి మండలంలో ఈ అద్భుతమైన ఎర్రటి ఆకాశం ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొందరు తమ సెల్ ఫోన్ వాట్సాప్ డీపీ పెట్టుకున్నారు.