బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు పేద ప్రజల అభివృద్ధికి ఆరు గ్యారెంటీలతో సంక్షేమ పథకాలను అందిస్తున్నమన్నారు గత ప్రభుత్వంలో చేయని విధంగా అన్ని రకాల అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు