పామూరు పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... పామూరు మేజర్ గ్రామపంచాయతీ తోపాటు మండలంలోని అన్ని పంచాయతీలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఎక్కడా కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.