గుంటూరు నగరంలోని మోతీలాల్ నగర్ జీరో లైన్ వాసులు తమ ఇళ్లను తొలగిస్తున్న నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులు వారి సమస్యలను కేంద్రమంత్రికి వివరించారు. 50 ఏళ్లుగా తాము అక్కడే నివసిస్తున్నామని, ఇప్పుడు ఇళ్లు తొలగిస్తే రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లను గుర్తించి తమకు కేటాయించాలని కాలనీవాసులు కోరారు.