మానవత్వానికి ప్రతీక రక్తదానమని, ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చునని శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా భీమవరం బ్రహ్మకుమారిస్ ఓం శాంతి యోగ భవనంలో ఆదివారం ఉదయం 11:30 కు మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. విలువైన రక్తాన్ని మనం సృష్టించలేమని, కేవలం దానం చేయడం ద్వారా మాత్రమే రక్త నిధి ఏర్పడుతుందన్నారు.