విశాఖలో మహిళల భద్రతే లక్ష్యంగా పని చేస్తున్నామని పోలీస్ కమిషనర్ శంఖ బ్రతబాగ్చీ అన్నారు. గురువారం సూర్యాబాగ్ సమీప కమిష నరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక /సూచిక (నారి) విడుదలైందన్నారు. ఆ నివేదిక ఆధారంగా విశాఖలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొనడం శుభపరిణామమన్నారు. నగరంలో మహిళల రక్షణకు 24 గంటలూ శ్రమిస్తున్నామన్నారు. రాత్రిపూట పోలీసు సిబ్బంది ద్విచక్ర వాహనాలపై ఇరుకు వీధుల్లోనూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.