ధర్పల్లి మండలంలోని రామడుగు సెక్టార్ మైలారం గ్రామంలో భేటీ జన్మోత్సవ్ కార్యక్రమాన్నీ డిచ్పల్లి సిడిపిఓ జ్యోతి, సూపర్వైజర్ సరిత ఘనంగా నిర్వహించారు. సిడిపిఓ జ్యోతి మాట్లాడుతూ భేటీ జన్మోత్సవ్ కార్యక్రమంలో బాగంగా మనస్వినీకి కిట్టు అందజేశామన్నారు. అందులో చిన్న పిల్లలకు సంబంధించిన ఆడుకోడానికి గిలక, డైపర్, టవల్ తో పాటు చిన్న చిన్న వస్తువులు అందులో ఉన్నాయని ఆమె తెలిపారు. పుట్టిన ప్రతి ఆడపిల్లకు అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు. పుట్టిన ప్రతి ఆడపిల్లను ఎదగనిద్దాం, చదవనిద్దాం, బ్రతకనిద్దాం అనే నినాదంతో ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం సెప్టెంబరు 17 నుండి అక్టోబర్ 16 వరకు ఉంటుందన్నారు.