అనంతగిరి మండలం గొండ్రియాల వాగు దాటేందుకు పందెం కాసి గల్లంతైన కిన్నెర ఉపేందర్ మృతదేహం లభ్యమైంది. కొత్తగూడెం గ్రామంలోని చెక్ డ్యాంలో ఎస్ఆర్ఎఫ్, పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. గత రెండు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగాయని రూరల్ సీఐ ప్రతాప్ తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.