హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో డాక్టర్ నీలి వాసవి కి ప్రభుత్వం అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు వాసవిని , ప్రభుత్వ కళాశాలలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఘనంగా సత్కరించారు. డాక్టర్ వాసవి గత 15 ఏళ్లుగా రసాయనశాస్త్రం సహాయ ఆచార్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.ఘన వ్యర్ధాల నిర్వహణ, నీటిపై వీటి దుష్ప్రభావాలు అనే శీర్షికపై పుస్తకాన్ని ప్రచురించారు.విద్యార్థుల అభ్యున్నతి లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టారు.ఓవైపు బోధిస్తూనే డిగ్రీ అనంతరం భవిష్యత్తు కార్యాచరణ పై ప్రత్యేక సదస్స