ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బోగోలు మండల కేంద్రంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ అంటేనే బడుగు బలహీన వర్గాల ప్రజల ఆరాధ్య దైవం అని అన్నారు.ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది.