కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీసీ పరిసరాలను పరిశీలించి, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అరా తీశారు. అనంతరం ఆర్టిసి గ్యారేజ్ ను పరిశీలించి, గ్యారేజ్ లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆర్టీసీ అధికారులను ఎండి ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. అదేవిధంగా శ్రీ శక్తి పథకం అమలు తీరుపై పరిశీలన జరిపి, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్టీసీ డిపో మేనేజర్ సయనా బేగం, సిబ్బంది ఉన్నారు.