మంత్రి కొండ సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలను కొట్టి పారేశారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తాను అదృష్టం కొద్దిగ గెలిచానని మంత్రి సురేఖ అనడం విడ్డూరమని అన్నారు పదవుల కోసం తాను ఎప్పుడు పార్టీ మారలేదని గుర్తు చేశారు తన నియోజకవర్గంలో ఉన్న భద్రకాళి దేవాలయం పాలకమండలి సభ్యులను తనకు తెలియకుండా భర్తీ చేయడం నచ్చలేదని ఆయన అన్నారు ఇక మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నారని తెలిపారు