పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు నివేశన స్థలాలు ఇవ్వడంతోపాటు 4లక్షలతో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావడం హర్షనీయమన్నారు.