నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం ఆమనగల్లులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించి మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మిర్యాలగూడలోని క్యాంపు కార్యాలయం నుండి భారీ కాన్వాయ్ తో బయలుదేరారు. ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాను డబ్బు సంపాదన కోసం రాజకీయాలలోకి రాలేదని, పది కాలాలపాటు గుర్తింపు పోయేలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు.