బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చింతలంక గ్రామానికి చెందిన తోడేటి హర్షవర్ధన్ ఆదివారం రాత్రి పెసర్లంక అరవింద వారిది పైనుండి కృష్ణా నదిలో పడిపోయాడు. ఈ ఘటనపై సోమవారం హర్షవర్ధన్ కుటుంబ సభ్యులు గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా తహసిల్దార్ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. తహసిల్దార్ ఆదేశాల మేరకు పోలీసులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు యువకుడి ఆచూకీ లభ్యం కాలేదని తహసిల్దార్ వెల్లడించారు. హర్షవర్ధన్ ఆచూకీ కోసం వారధి వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.