మూడు నెలల క్రితం ముగించిన సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. సమ్మె కాలపు జీతాలు, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, జీరో ట్రాన్స్ఫర్, కొత్త జాబ్ చార్ట్ సవరణలపై స్పష్టత ఇవ్వాలని ఏపీఎంసీఏ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ హామీలను తక్షణమే అమలు చేయాలని వారు కోరారు.