గోదావరి వరద ఉద్ధృతితో మామిడికుదురు పరిధిలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రెండవ రోజు శనివారం కూడా అప్పనపల్లి కాజ్ వే తో పాటు ఉచ్చుల వారి పేటకు వెళ్లే సిమెంట్ కాంక్రీట్ రోడ్డు ముంపులోనే ఉంది. అప్పనపల్లి కాజ్ పై రాకపోకలు నిలిపి వేసిన సంగతి విధితమే. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. ఉచ్చుల వారి పేట మీదుగా లంక గ్రామాల ప్రజలు వరద నీటిలో తీవ్ర ఇబ్బందుల నడుమ రాకపోకలు సాగిస్తున్నారు.