పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరపరుపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల మీద తన పెత్తనం సాగించడానికి అమెరికాలో తన బలాన్ని పెంచుకోవడానికి రకరకాలు విన్యాసాలు చేస్తున్నారని అన్నారు. భారతదేశ ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాలను వ్యతిరేకించకుండా మౌనంగా ఉండడం, ఈ దేశ 140 కోట్ల ప్రజలను వంచించడమే అని వారు తెలిపారు.