చీమకుర్తి: సెప్టెంబర్ 25వ తేదీన విజయవాడలో నిర్వహించ తలపెట్టిన యుటిఎఫ్ రణభేరి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని చీమకుర్తి మండల యూటీఎఫ్ అధ్యక్షులు అక్బర్ బాషా పిలుపునిచ్చారు. యుటిఎఫ్ రణభేరికి సంబంధించిన పోస్టర్లను శనివారం ఉపాధ్యాయులతో కలిసి అక్బర్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను తక్షణ విడుదల చేయాలని, బోధ నేతల పనులకు ఉపాధ్యాయులను ప్రభుత్వం వినియోగించవద్దని డిమాండ్ చేశారు.