మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి PACS వద్ద ఆదివారం యూరియా కోసం రైతులు వేకువజాము నుంచే పోటెత్తారు. ఒక్క బస్తా యూరియా కోసం చంటి బిడ్డను తీసుకొని పడిగాపులు కాస్తున్నామని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక నిద్రాహారాలు మానేసి నరకయాతన పడుతున్నామన్నారు. ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు పడుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఎలా రాజు అవుతాడని పేర్కొన్నారు.