మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సత్యసాయి జిల్లా వైసీపీ అనుబంధ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. బుధవారం పుట్టపర్తి లోని మాజీ ఎమ్మెల్యే దిద్దుకుంటా శ్రీధర్ రెడ్డి నివాసంలో జిల్లా వైసీపీ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాటంలో జిల్లా అనుబంధ కమిటీలదే కీలక భాగమని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలో అనుబంధ సంఘాలకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకుడు రమేష్ రెడ్డి పాల్గొన్నారు.